Balagam Fame Kota Jayaram : బలగం సినిమా కంటే ముందు కుక్క కంటే హీనంగా చూసేవారు…లైవ్ లో కంటతడి పెట్టుకున్న బలగం ఫేమ్ కోట జయరాం…

Balagam Fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం సంస్కృతిని, కళ్ళకు కట్టినట్లుగా బలగం సినిమా ద్వారా చూపించి భారీ విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు. ఒక ఇంటి పెద్ద దిక్కు అయిన వ్వక్తి చనిపోయినప్పుడు ఆ ఇంట్లో కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది. ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అంతేకాక బలగం సినిమా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దేశ విదేశాలలో కూడా నచ్చుతుంది. తెలంగాణ పల్లెలో అయితే అందరూ ఓ చోట చేరి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయిందని చెప్పాలి. అంతేకాక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు కూడా నటించకుండా వారి వారి పాత్రలలో జీవించేశారు. అయితే వారిలో కొందరు ఇంతకుముందే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మునుపెన్నడూ రాని గుర్తింపు ఈ సినిమాతో వారికి లభించింది.

అలా ఈ సినిమాలో హీరో తండ్రిగా ఐలయ్య పాత్రలో నటించిన కోట జయరాం గారు ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం బలగం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్నపటికీ, జయరాం గారు సినిమాల కంటే సీరియల్స్ లో బాగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 40 కి పైగా సీరియల్స్ లో ఆయన నటించారు. అయితే బలగం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే విషయం పై ఆయన మట్కాడుతూ..ఈ పాత్ర కోసం ముందుగా తన స్నేహితుడు శ్రీధర్ రెడ్డికి అవకాశం రాగా తాను చేయలేనని చెప్పాడట. దీంతో అదే సమయంలో అక్కడే జయరాం ఉండడంతో అక్కడే ఆడిషన్ పూర్తి చేశారట వేణు.

మళ్ళీ మూడు నెలల తర్వాత ఈ పాత్రకు జయరాం ను సెలెక్ట్ చేసినట్లుగా చెప్పారు. అలా బలగం సినిమాలో జయరాం గారికి అవకాశం లభించింది అట. అలాగే అంతకుముందు తన సినీ జర్నీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
చిన్న చిన్న పాత్ర అయినా పర్లేదని చాలా సినిమాల్లో చేశారట. మొదట్లో ఒక సినిమా సమయంలో బాగా చేస్తున్నానని కెమెరా మెన్ నా మీద ఫోకస్ పెడుతుంటే పక్కన కుక్క మీద పెట్టు అతని మీద ఎందుకు అని ఎవరో అన్నారట. కుక్క కి ఉన్న వాల్యూ ఆర్టిస్ట్ కి లేదా అని అప్పుడు ఆయన బాధపడ్డారట. ఇప్పుడు అదే కో డైరెక్టర్ మళ్లీ కనిపిస్తే నువ్వు చాలా బాగా యాక్ట్ చేసావని చెప్తాడు. అది ఆయన తప్పు కూడా కాదు కానీ ఆ క్షణం నాకు బాధేసింది అంటూూ జయరాం చెప్పుకొచ్చారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More