Prabhas : కృష్ణంరాజు కుటుంబం నుంచి చాలా సామాన్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి సినిమా నుండి తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాలి. ఆ తర్వాత రాజమౌళి ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో అయ్యాడు ప్రభాస్. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన సినిమాలు బడ్జెట్ పరంగా మరియు అంచనాల పరంగా చాలా భారీ స్థాయిలో ఉంటున్నాయి. అయితే ప్రభాస్ అంతటి పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉండిపోవడం గమనార్హం.
సినిమాల పరంగా అభిమానులకు సంతృప్తిని ఇచ్చే ప్రభాస్, తన పెళ్లి విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ మిగిలిస్తున్నారు. ఎన్నిసార్లు ఎంతమంది మీ పెళ్ళెప్పుడు అని అడిగిన ఒక్క చిరున్నవ్వు తో సమాధానం ఇస్తున్నాడు. అయితే ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇలాంటివి ఇంతకుముందే మనం చాలానే చూసాం. ఎక్కువగా ప్రభాస్ అనుష్క ప్రేమించుకున్నారని, కాని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకోవట్లేదని వార్తలు వచ్చాయి. ప్రభాస్ అభిమానులైతే.. అనుష్కకు ప్రభాస్ కి పెళ్లి జరిగితే బాగుండు అనే అనుకునేవారు. కానీ అనుష్క మరియు ప్రభాస్ మేము మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పడంతో వీరిద్దరి పైన రూమర్స్ రావడం ఆగిపోయేది.
అయితే ఇటీవల ప్రభాస్ పెళ్లి విషయంపై మరొక న్యూస్ బయటకు వచ్చింది. అయితే ప్రభాస్ కు కుజదోషం ఉందట. కుజదోషం ఉన్నవారికి పెళ్లి త్వరగా జరగదు. అంతేకాక కుజదోషం ఉన్నవారికి అలాంటి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చి చేస్తే మంచిదట. అందుకని ఈ విషయంలో ప్రభాస్ తల్లి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారట. ప్రభాస్ కి కుజదోషం ఉండటం వలన కుజదోషం ఉన్న అమ్మాయిని ప్రభాస్ ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. మరి ప్రభాస్ ఈ సంవత్సరమన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తాడో లేదో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More