Viral Video : సంకల్పం గట్టిదైతే ఎలాంటి ఆటంకాలు ఎదురైన వాటన్నింటిని దాటుకుని మరి అనుకున్న లక్ష్యం దిశగా మన అడుగులు వేస్తాం. ఇది ఎవరు నమ్మలేని నిజం. అయితే అంగవైకల్యం కలవారికి ఇలాంటి పట్టుదల , కసి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంగవైకల్యం కలిగిన వారు అని వారిపై జాలి చూపించే అవకాశం ఇవ్వకుండా వారు ఏం చేయగలరో చేసి మరి చూపిస్తారు. అయితే ఇలాంటిదే ఓ చిన్నారి కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియో దృశ్యాల ప్రకారం చూస్తే ఒక కాలు లేని చిన్నారి ఓ పరుగు పందెంలో పాల్గొనడం చూడవచ్చు. పైగా ఆ చిన్నారి పోటీ పడింది ఎలాంటి అంగవైకల్యం లేని తన తోటి చిన్నారులతో. ఓడిపోతాను అని తెలిసి కూడా ఎలాంటి భయం, బాధ లేకుండా పోటీలో పాల్గొనడం అనేది నిజంగా గర్వకారణం. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం అని చెప్పవచ్చు. నాకు కాలు లేకపోవచ్చు కానీ ఎదుటివారికి పోటు ఇవ్వగలననే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని తెలిసేలా చేసింది. ఒంటికాలితో చివరి వరకు పరుగుపందంలో పాల్గొని రేసును పూర్తి చేసింది.
ఈ చిన్నారి పరుగుపందంలో ఓడిపోయినప్పటికీ వీక్షిస్తున్న ప్రేక్షకుల మనసులను మాత్రం గెలుచుకుంది. అంతేకాక దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ చిన్నారి స్వయంకృషి చూసి ఆమెను ప్రశంసిస్తున్నారు. చిన్నారి మనోధైర్యానికి సలాం కొడుతున్నారు. ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపుగా 7.7 మిలియన్ మంది వీక్షించారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More