DELHI METRO : సోషల్ మీడియా వచ్చాక ఆకతాయి పనులు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వాటిని వీడియో తీసి షేర్ చేయడం సర్వసాధారణమైంది. ఇలాంటివారు ప్రతిరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. కొందరు జంతువులను హింసిస్తూ వీడియోలు తీస్తుంటే…మరి కొందరు ఫ్రాంక్ వీడియోలు అంటూ జనసంచార ప్రాంతాలలో వింత వింత పనులు చేస్తూ అందరిని ఆగ్రహానికి గురి చేస్తున్నారు. మరి కొందరు మెట్రో రైల్లో గొడవలు పడుతూ, డాన్సులు వేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తున్నారు. ఇక ఇలాంటిదే ఇప్పుడు ఒక వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. ఓ మెట్రో రైల్లో ఆకతాయి కుర్రాళ్ళు చేసిన పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియో ఇది. మెట్రో డోర్ వద్ద నిలబడి వారు చేసిన పని చూసి నేటిజనులు మండిపడుతున్నారు.
అయితే ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలు చోటుచేసుకుంది. అయితే మెట్రో రైల్ కరోల్ బాక్స్ స్టేషన్ వద్దకు రాగానే ఆటోమేటిక్ గా తలుపులు తెరుచుకున్నాయి. మెట్రో డోర్ పక్కనే కొందరు కుర్రాళ్ళు నిలబడి ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎక్కిన తర్వాత డోర్లు మరల ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. కానీ డోర్ కి మధ్యలో ఎవరైనా వస్తే మరలా తెరుచుకుంటాయి. ఇది గమనించిన ఆకతాయి కుర్రాళ్ళు మెట్రో రైల్ డోర్ వద్ద నిలబడి తలుపులు మూసుకునే సమయంలో కాళ్లు అడ్డు పెడుతూ డోర్ మూసుకుపోకుండా చేస్తున్నారు. పదే పదే వారు కాలు పెట్టడంతో డోర్ ఆటోమేటిక్ గా మళ్లీ తెరుచుకుంటుంది.
పదే పదే ఇలా చేయడంతో రైలు కొంతసేపు కదలకుండా అక్కడే ఉండిపోయింది. ఇక వీరి పిచ్చి చేష్టలు చూసిన తోటి ప్రయాణికులు ఆగ్రహించారు. కానీ వారు మాత్రం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఘటనను రైల్లో ప్రయాణిస్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆకతాయి చేష్టలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కొందరు…ఇలాంటి వారికి ఫైన్ వేయాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More