Viral news : బీహార్ లోని ముజాఫర్ పూర్ , బోచాహ పోలీస్ స్టేషన్ పరిధిలో రాంపూర్ జైపాల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పని పాటా లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అయితే ఒకరోజు అదే ప్రాంతంలో నిర్వహించిన స్టేజి షో కి వెళ్లి స్టేజిపై 19 ఏళ్ల హిజ్రా ప్రదర్శనకు ఫిదా అయిపోయాడు. ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత హిజ్రా దగ్గరకు వెళ్లి మీరంటే నాకు ఇష్టమని పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజ్ చేశాడు. ఇది విన్న హిజ్రా ఆశ్చర్యానికి గురైంది. నేను ఒక హిజ్రా ని నన్ను పెళ్లి చేసుకున్న నీకు పిల్లల్ని కనిపెట్టలేనని అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంటూ అమే యువకుడిని మందలించింది.. అయినా కూడా యువకుడు ఆమెను వదలకుండా వెంబడిస్తూ ఉండేవాడట.
ఇలా రోజు తన చుట్టూ తిరుగుతుండడంతో చివరికి హిజ్రా కూడా పెళ్లికి ఓకే అనడంతో పెళ్లి చేసుకుని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుండి తన భార్య స్టేజ్ షోల ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని అతడే తీసుకునే వాడట. అలా వచ్చిన డబ్బుతో కొత్త ఇంటిని నిర్మించడంతోపాటు తన సోదరుడికి పెళ్లి కూడా చేశాడు. ఇక తాను అనుకున్నవన్నీ జరిగిన తర్వాత వారి వివాహమైన ఆరు నెలల తర్వాత నుంచి భార్యను బేధించడం మొదలుపెట్టాడు. అయినా కూడా అమే ఓపికగ భరిస్తూ వచ్చింది.
అంతటితో ఆగకుండా యువకుడు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటూ నువ్వు నా ఇంటి నుండి వెళ్లిపో అని ఆమెను బయటకు నెట్టేసాడు. దీంతో మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పి తన భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఈ ఘటన అక్కడ ప్రాంతంలో తీవ్ర చర్చనీయంగా మారింది. జులాయిగా తిరిగే యువకుడు ఇలా హిజ్రాను పెళ్లి చేసుకుని తనకు కావలసినవి దక్కించుకొని ఇప్పుడు వదిలేయడానికి చూస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి దీన్ని పోలీసులు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More