Viral Video : పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లలకు భయం చాలా తక్కువ. ఎందుకంటే వారికి ఏది ప్రమాదమే ఏది ప్రమాదం కాదో తెలుసుకునే జ్ఞానం లేదు. దీంతో వారు ప్రమాదకర వస్తువులు , జంతువులతో కూడా ఆడుకోడానికి ఇష్టపడుతుంటారు. అందుకే పిల్లలకు ఊహ వచ్చేంతవరకు పెద్దలు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ బుడ్డోడు భారీ కొండచిలువతో ఆడుకుంటూ కనిపించాడు. ఆ కొండచిలువ ఆకారం చూస్తుంటే ఆ బుడ్డోడిని అమాంతం మింగేంత పరిమాణంలో ఉంది. అంతటి భారీ కొండచిలువతో బుడ్డోడు ఆడుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దీంతో ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఓ బుడ్డోడు నడిరోడ్డు మీద భారీ కొండచిలువతో ఆడుకుంటున్నాడు. అది పాకుతూ వెళ్తుంటే దాన్ని వెళ్ళనివ్వకుండా తల పట్టుకుని ఎత్తి పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక ఆ కొండచిలువపై కూర్చుని ఆడుకుంటున్నాడు. దీంతో ఈ వీడియో చూసి నేటిజనులు ఆందోళన చెందుతున్నారు. అది పెంపుడు కొండచిలువనా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత పెంపుడు జంతువు అయినప్పటికీ పిల్లాడిని అలా వదిలేయడం చాలా దారుణమని వారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెంపుడు జంతువు అయినప్పటికీ దానికి ఆకలి అనిపించి ప్రమాదవశాత్తు ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా Figen అనే యూజర్ తల్లిదండ్రుల నిర్వాహకం అని క్యాప్షన్ తో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోను ఇప్పటికీ 97 వేల మంది వీక్షించారు. అలా వీడియో తీసేందుకు కుర్రాడితోపాటు కొండచిలువను కూడా ఇబ్బంది పెట్టారని పలువురు కామెంట్స్ లో తెలియజేస్తున్నారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More