Coriander Water : భారతీయ వంటకాలలో ధనియాలకు చాలా ప్రత్యేకత ఉంది. భారతీయ వంటకాలలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది ఆయా వంటకాలకు మంచి రుచిని, వాసనను అందిస్తాయి. అంతేకాక ధనియాలలో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అయితే ప్రతిరోజు ఉదయం పరిగడుపున ధనియాల నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ధనియాల నీటిని తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేసవి కాలంలో ధనియాల నేటిని తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. వేసవిలో దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది.
ధనియాలలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి తో పాటు ఇతర రకాల పోషకాలు కూడా ఉన్నాయి. అలాగే ధనియాల ను హెర్బల్ టీ లేదా డికాషన్ లా చేసుకొని తీసుకోవచ్చు. అయితే ప్రతిరోజూ ధనియాల నీళ్లను తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ధనియాల నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీంతోపాటు గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు ధనియాల నీరు తాగడం చాలా మంచిది.
ప్రతిరోజు దునియాల నీటిని త్రాగడం వలన పొట్ట కు చాలా మంచిది. పొట్ట లో ఏర్పడే గ్యాస్ ,అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలకు ఇది మంచి చిట్కా.. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఉబ్బరం ,గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
ప్రతిరోజు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాక ఈ ధనియాల నీటిలో కొద్దిగా కొత్తిమీర కలుపుకొని తాగితే, ఆంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా వంటి వాటి నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
మోకాలు నొప్పులు జాయింట్ లేదా అర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు ధనియాల నీటిని తాగడం చాలా మంచిది. ఇది నొప్పిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More