Health Tips : ఎండు ద్రాక్షను ఇలా తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా…ఒక్కసారి ట్రై చేయండి…

Health Tips : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. మరి ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. అయితే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకుంటే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీనివలన అపాన వాయు సమస్య కూడా వస్తుంది. దీంతో ఎసిడిటీ పెరిగి పుల్లటి తేన్పులు వస్తుంటాయి. అంతేకాక ఒక్కోసారి భరించలేని కడుపునొప్పి కూడా వస్తుంటుంది.

అయితే ఉదర సంబంధిత వ్యాధులకు ఎండు ద్రాక్ష చాలా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్లు, కనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు, పైన్ న్యూట్రియెంట్లు, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన శక్తి పెరుగుతుంది. మరి ముఖ్యంగా మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ప్రతిరోజు ఎండుద్రాక్షను తీసుకోవడం వలన ఉపశమనం పొందుతారు. అంతేకాక ఎముకలు దంతాలు రెండింటికీ ప్రయోజనం కలుగుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది.

అలాగే ఎండుద్రాక్ష లో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటు నుండి మనల్ని రక్షిస్తుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఉండి పీచు, మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకోవడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాక జీర్ణక్రియ ను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అయితే ఎండు ద్రాక్షాలను నీటిలో నానబెట్టుకుని ఆ తర్వాత వాటిని తినాలి. ఎండు ద్రాక్షను ఇలా తీసుకోవడం వలన మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని, ఇప్పుడు అంచనాలు మరియు ఇంటర్నెట్లు దొరికే సమాచారం ఆధారంగా , ఇవ్వడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More