Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు… ఏప్రిల్ 23 – 29

Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి కలిసొస్తుంది? ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అనే విషయాలను రాశి చక్రం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఏప్రిల్ 23 నుంచి 29 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి:

ఉద్యోగ పరంగా ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగలలో ముందుకు వెళ్తారు. ఐటీ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. సమాజంలో విలువ పెరుగుతుంది. గౌరవ సత్కారాలను అందుకుంటారు. కుటుంబ పరంగా కొద్దిపాటి మనశ్శాంతి లోపిస్తుంది. డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు.

 

వృషభ రాశి :

ఆర్థిక పరిస్థితులలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్నవి నెరవేరుతాయి. బలహీనతలను బయట పెట్టకూడదు. శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో ఆశించిన సహాయ సహకారాలు తోటి వారి నుండి లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతుంటాయి.

మిధున రాశి :

బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం పొందుతారు.కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఆలోచనలు చేస్తారు. అనవసర పరిచాయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం ఉంది.

కర్కాటక రాశి :

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగం మరియు బంధు వర్గాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో బిజీగా ఉంటారు.

సింహరాశి :

ఉద్యోగ వ్యాపార రంగాలలో అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములు లేదా సహచరుల నుండి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాలలో దూరంగా ఉండటం మంచిది. ఇరుగుపొరుగు వారి నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒంటరిగా వాహన ప్రయాణం మంచిది కాదు.

కన్యరాశి :

ఒకటి రెండు ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతతలు నెలకొంటాయి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంలోని ఒకరికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణిస్తుంది. హామీలు ఇవ్వడం మంచిది కాదు.

తులారాశి :

వ్యాపార పరంగా బాగా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారి వారి వృత్తులలో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ప్రతిభను నిరూపించుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

వృశ్చిక రాశి :

ఆకస్మిక ధన లాభాన్ని ఆర్జిస్తారు. తిరిగి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ పరంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. వాగ్దానం చేయడం హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

ధనస్సు రాశి :

వృత్తిలో నైపుణ్యం సాధిస్తారు. వ్యాపారం ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ముందుకు వెళుతుంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి :

శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఫలితాలను అందిస్తాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలను అందుకుంటారు. అవసరానికి తగ్గట్టు డబ్బును పొందుతారు. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.

కుంభరాశి :

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భయపడడం మంచిది కాదు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులుకు శుభవార్త అందుతుంది. ఆస్తి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

మీన రాశి :

ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ప్రతిభకు తగిన గుర్తింపును పొందుతారు. వృత్తి పనులకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

 

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్లు దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం. జరిగింది తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More