Durga Devi : కలలో దేవతలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా…?తప్పక తెలుసుకోండి…

Durga Devi  : మనకు నిద్రలో వచ్చే కలలను అంత తేలికగా తీసి పారేయకూడదు.ఇలా వచ్చే ప్రతి కలకు ఒక అర్థం లేదా సంకేతం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో అమ్మవారు దర్శనమిస్తే మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే ఎలాంటి ఫలితాలు గోచరిస్తాయే అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరికైనా సరే దుర్గాదేవి కలలో కనిపిస్తే దాని అర్థం భవిష్యత్తులో వారి జీవితంలో జరగబోయే మంచి లేదా చెడుకు సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ క్రమంలోనే సాక్షాత్తు దుర్గాదేవి దర్శనమిస్తే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కలలు రావడం జరుగుతుంది.

అయితే కొన్ని సందర్భాలలో వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కలల ద్వారా తెలుస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఇలా వచ్చే కలలు అన్నింటిని అందరు గుర్తుపెట్టుకోలేరు. కొన్ని కలలను మర్చిపోతారు కానీ కొన్ని కలలు మాత్రం పదేపదే గుర్తుకొస్తుంటాయి. అయితే రాత్రి సమయంలో ఎవరికైనా దుర్గాదేవి కలలో దర్శనం ఇచ్చినట్లయితే మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అర్థమట. మీ జీవితం సాఫీగా సాగుతుందని ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని సంకేతమట. ఇక అదే దుర్గమ్మ దేవి ఆగ్రహంగా కనిపించినట్లయితే ఇక ఆ వ్యక్తికి ఏదో ఒక తప్పు జరగబోతున్నట్లు , దానిని సరిదిద్దుకోమని దుర్గాదేవి ఆదేశించినట్లు అర్థమట.

అలాగే దుర్గాదేవి ప్రసన్నవదనంతో కనిపిస్తే మాత్రం వారికి అధిక ధన లాభం కలుగుతుందని నమ్మకం. అలాగే ఆ వ్యక్తి కెరియర్ పరంగా వ్యాపారం పరంగా చాలా అభివృద్ధి చెందుతాడని అర్థం. అంటే అతని పట్టిందల్లా బంగారమవుతుంది. అలాగే కొంతమందికి కలలో శ్రీకృష్ణుడు కూడా దర్శనమిస్తుంటాడు. ఇలా శ్రీకృష్ణుడు కలలో కనిపించినట్లయితే ఆ వ్యక్తి బ్రహ్మచారి అయినట్లయితే వెంటనే అతనికి పెళ్లి జరుగుతుందని అర్థమట. అదే పెళ్లి అయిన వారికి కనిపిస్తే జీవితం ఆనందమయంగా ఉంటుందని అర్థమట. అలాగే వినాయకుడితో మాట్లాడుతున్నట్టుగా కలగన్నట్లయితే మీరు నేరుగా ఆధ్యాత్మిక మార్గదర్శకంలోకి వెళ్తున్నారని తెలివైన వ్యక్తి నుంచి మార్గదర్శకం అవసరమని సూచిస్తుందట. అంతేకాక కలలో విరిగిన దంతం కనిపించినట్లయితే త్యాగానికి ప్రతిక గా భావిస్తారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More