AP MLC Results : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు రంగం సిద్ధం.. గెలిచేది ఎవరు.. నిలిచేది ఎవరు..

AP MLC Results : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తి చేసి రంగం సిద్ధం చేసింది. మొత్తం 9 స్థానాలలో 119 మంది బరిలో నిలవగా, పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. ఈరోజు  ఫలితాల వెల్లడి మొదలయింది. అదే పూర్తి ఫలితాలు రావడానికి కనీసం మూడు రోజులు పట్టవచ్చట. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 13న జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల లో మూడు గ్రాడ్యుయేట్ రెండు ఉపాధ్యాయ నాలుగు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమగోదావరి స్థానిక సంస్థ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా ఎన్నికలకు దాదాపుగా 9 ఉమ్మడి జిల్లాల ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపు తమదంటే తమదంటూ ఇరు వర్గాలు బలంగా చెబుతున్నాయి. అయితే స్థానాలు అన్ని మావే అంటూ అధికార పార్టీ వైసీపీ ప్రకటించింది. మరోవైపు బిజెపి పొత్తులో కొనసాగుతుంది.

ఇంకా విశాఖ గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి 37 మంది పోటీ చేయగా, కడప అనంతపురం కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుండి 49 మంది, ప్రకాశం నెల్లూరు చిత్తూరు గ్రాడ్యుయేట్స్ స్థానం నుండి 22 మంది పోటీ చేశారు. కడప అనంతపురం కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల నుండి 12 మంది , పోటీ చేయగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది పోటీగా నిలిచారు. ఇక శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు కర్నూల్ స్థానానికి ముగ్గురు పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు పోటీపడ్డారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నికలు కావడంతో , లెక్కింపు విషయంలో తగిన , జాగ్రత్తలు ,తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే లెక్కింపు ప్రక్రియ లో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించాల్సి ఉంటుంది. ముందుగా చెల్లని ఓట్లను పక్కన పెడతారు. అంటే బ్యాలెట్ పేపర్లో 1,2,3 అంకెలకు బదులుగా ఏబీసీ లేదా ఇతర అక్షరాలు ఉన్న పేపర్లను చెల్లని ఓట్లుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇక మిగతా ఓట్లను లెక్కలోకి తీసుకొని ఒక కోడ్ ప్రకారం లెక్కింపులు మొదలు పెడతారు.

 

సాధారణంగా అయితే ఎమ్మెల్సీ స్థానానికి ఒక ఓటర్ వేసి ఓటు విలువ ఒకటిగా ఉంటుంది. అదే ఒకే చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరిగితే దాన్ని అక్కడ ఒక ఓటర్ వేసిన ఓటును 100 గా పరిగణిస్తారు. దీని ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఒక్క ఓటు విలువ 100 గా లెక్క పెడతారు. కౌంటింగ్ చేసేటప్పుడు ఒక స్థానం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల విలువలను సగం చేసి దానికి ఒకటి కలిపి వచ్చిన దాన్ని బట్టి గెలుపును నిర్ణయిస్తారు.అదే రెండు స్థానాలు ఉన్నచోట అంటే పశ్చిమగోదావరిలో మొత్తం చెల్లుబాటైనా ఓట్ల విలువలను మూడు భాగాలుగా చేస్తారు. దానికి ఒకటి కలిపి వచ్చిన విలువ ఆధారంగా గెలుపు నిశ్చయిస్తారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటును నిర్దేశిక కోట చేరుకోలేక పోతే రెండు ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. ఒకవేళ నిర్దేశిత కోటాను ముందే చేరుకుంటే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే జరిగినవి బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి అన్నిచోట్ల అభ్యర్థులు ఎక్కువ ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అధికారులు తెలియజేశారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More