Chandra Babu Naidu : చంద్రబాబుకు మరో భారీ షాక్… ములాఖత్ కు బ్రేక్…ఇక జైల్లోనే..

Chandra Babu Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.గత నెల రోజులుగా చంద్రబాబు నాయుడు జైల్లోనే జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక ఆయన ఎప్పుడు బయటకు వస్తారు అనేది తెలియని పరిస్థితి. అయితే ఒక్కసారి చంద్రబాబు బయటకు వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో ఉత్సవాలు మామూలుగా ఉండవని చెప్పాలి. ఆయన బయటికి వస్తే మాత్రం అధికార వైసిపి వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అంటున్నారు టిడిపి నేతలు. కానీ జగన్ మాత్రం చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ముగిసే వరకు బయటకు రప్పించకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడని రాజకీయ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు ఎలా ఉంటాయో జగన్ ముందుగానే పసిగట్టాడని , అందుకే ఒక కేసులో చంద్రబాబుకు విముక్తి కలిగిన మరొక కేసులో ఆయన్ని ఇరికించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఇలా వస్తున్న ఆరోపణలను వైసిపి అధినేతలు తిప్పి కొడుతున్నారు. స్కామ్ లు చేయడం వలన చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఆయన అరెస్టుకి మాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నారు. అయితే గత రెండు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గ్రాప్ కాస్త తగ్గిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో జనసేన కలయిక తక్కువ మెజారిటీతో అయిన టిడిపి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని పలువురు సర్వేల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుప్పకూలిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం ములాఖత్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికీ రోజుకి రెండు మూడు ములాఖత్ ఉండటం వలన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు ప్లాన్ ప్రకారమే సజావుగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని అందుకే ఇప్పుడు ములాఖత్ కు బ్రేక్ వేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రోజుకు ఒకే ఒక ములాఖత్ ఉంటుందట. అది కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని సమాచారం. అయితే ఇలా ములాఖత్ ను సాధ్యమైనంత తగ్గిస్తే చంద్రబాబు ఐడియాస్ తెలుగుదేశం పార్టీకి చేరకుండా ఉంటాయని అప్పుడు సులువుగా టిడిపిని దెబ్బ తీయవచ్చు అని ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఇలా వస్తున్నావా వార్తలపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More