New Covid Variant : N-1 పేరుతో కరోనా కొత్త సబ్ వేరియంట్…..
New Covid Variant : దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వేరియెంట్ టెర్రర్ రేపుతుంది. JN-1 పేరుతో కరోనా కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒకరి నుంచి ఒకరికి సోకే గుణం ఎక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఒక్కరోజే 335 కేసులు ఐదుగురు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా ఇది కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో JN-1 వేరియంట్ వ్యాప్తితో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం దక్షిణాది అన్ని రాష్ట్రాలకు ముప్పు తప్పదా అనే భయం ఏర్పడింది. […]
New Covid Variant : దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వేరియెంట్ టెర్రర్ రేపుతుంది. JN-1 పేరుతో కరోనా కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒకరి నుంచి ఒకరికి సోకే గుణం ఎక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఒక్కరోజే 335 కేసులు ఐదుగురు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా ఇది కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో JN-1 వేరియంట్ వ్యాప్తితో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం దక్షిణాది అన్ని రాష్ట్రాలకు ముప్పు తప్పదా అనే భయం ఏర్పడింది. ఇప్పుడు ఇది నిజంగానే కరోనా ఖతం అనుకునే వాళ్ళకి కంగారు పుట్టించే వార్త ఇది. వైరస్ జమాన ముగిసింది లైట్ గా తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. JN -1 కొత్త పేరు తో పుట్టుకొచ్చి దేశం మొత్తాన్ని భయపెడుతుంది.
దేశవ్యాప్తంగా ఒక్కరోజే 335 కరోనా కేసులు పుట్టాయి అంటే ఈ వైరస్ ఘాటుకు ఐదుగురు చనిపోయారు అంటే ఈ వైరస్ ఎంత డేంజరో అర్థమవుతుంది. ఈ వైరస్ ఎందుకంత డేంజర్ నో…? దీనికి ఎన్ని రాష్ట్రాల కి ముంపు ఉన్నది…? మళ్లీ కోవిడ్ గైడ్నెస్ షురూ అవబోతున్నాయా..? ఇలాంటి ప్రశ్నలతో టెర్రర్ పుట్టిస్తుంది ఈ కొత్త వేరియంట్ JN-1. అయితే మూడేళ్ల కిందట ప్రపంచాన్ని వనికించిన కరోనా భూతాన్ని దాదాపు అందరం మర్చిపోయాం. మాస్కులు, టీకాలు, జాగ్రత్తలు మర్చిపోయాలోపే జె ఎన్ వన్ పేరు తో కరోనా కొత్త సబ్ వేరియట్ పుట్టుకొచ్చింది. జె ఎన్ వన్ కరోనా కొత్త సబ్ వేరియంట్ మొదటగా సెప్టెంబర్ అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్ నీ చైనాలో ఏడు కేసులుగా గుర్తించారు. ఆ తరువాత తొలి కేసు మన దేశంలోనీ కేరళ లో మరియు తిరుమల, అనంతపురం లో గుర్తించారు.
ఈ నెల 8న కేరళలో 78 ఏళ్ల మహిళల్లో JN-1 లక్షణాలు కనిపించాయి. ఇది సులభంగా ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధిగా గుర్తించారు. ఈ కేసులు వేగవంతంగా వస్తుండడంతో ఆందోళన కలుగుతుంది. నిన్న ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనివలన ఐదుగురు చనిపోయారు ఈ ఐదుగురులో నలుగురు కేరళకు చెందినవారు ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు. దేశంలో మొత్తం 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని గుర్తించారు. నిజానికి జె ఎన్ వన్ కరోనా సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో కొంతమంది భారతీయులకు సోకినట్లు తెలుస్తుంది. దీనికి మరి అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కేరళ వైద్యశాఖ అటు కర్ణాటకలో JN-1 పేరుతో కరోనా అలర్ట్ జారీ అయింది. ఇప్పటివరకు 58 కోవిడి కేసులు నమోదయ్యాయి. ఇక ఇది దేశం మొత్తం సోకుతుందని భావించిన నాలుగు ప్రభుత్వాలు ముందుగానే అలర్ట్ ను జారీ చేశాయి.