Nara Lokesh : నారా లోకేష్ అరెస్ట్ కు అనుమతి కోరిన సిఐడి…

Nara Lokesh : ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి జైలు నుండి బయటకు రాగా ఇప్పుడు నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఉన్న నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు సిఐడి కోర్టును అనుమతి కోరింది. అదేవిధంగా నారా లోకేష్ యువగలం సభలో మరియు […]

  • Published On:
Nara Lokesh : నారా లోకేష్ అరెస్ట్ కు అనుమతి కోరిన సిఐడి…

Nara Lokesh : ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయి జైలు నుండి బయటకు రాగా ఇప్పుడు నారా లోకేష్ ను అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా ఉన్న నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు సిఐడి కోర్టును అనుమతి కోరింది. అదేవిధంగా నారా లోకేష్ యువగలం సభలో మరియు పలు ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలపై సిఐడి అభ్యంతర వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే లోకేష్ రెండుసార్లు సిఐడి తో విచారణకు హాజరు కాగా..నిబంధనలకు వ్యతిరేకంగా లోకేష్ వ్యవహరించారని కాబట్టి లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు వారంటీ జారీ చేయాలంటూ సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

cid-seeks-permission-to-arrest-nara-lokesh

నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసి లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలను ఆధారాలతో సహా ఏసిబి కోర్టుకు అందజేసింది. కాగా యువగలం ముగింపు సందర్భంగా నారా లోకేష్ పలు మీడియాలలో ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని సిఐడి ఆరోపిస్తోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ విధించడం కూడా తప్పని ఏసిపి న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని సిఐడి తన మెమోలో పేర్కొంది.

అయితే స్కిల్స్ స్కామ్ , ఓఆర్ఆర్ ఫైబర్ నెట్ స్కామ్ కేసులలో అప్పటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని..అంతేకాక వారి అభ్యంతరాలను పట్టించుకోలేదని …అలాగే టిడిపి ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా చాలామంది ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సిఆర్పిసి కింద వాగ్మూలం ఇచ్చారని తెలియజేశారు.అయితే ఆ వాగ్ములాలను తప్పుపట్టే విధంగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయని, సిఐడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. విచారణలో ఉన్న అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రికార్డు చేశానని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి సంగతి చూస్తామంటూ లోకేష్ చేసిన హెచ్చరికలను సిఐడి మెమోలో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సాక్షాలను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించే విధంగా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారని సిఐడి మేములో పేర్కొంది. 41 ఏ నోటీసులో పేర్కొన్న షరతులకు లోకేష్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అతనిపై అరెస్టు వారెంట్ ను మంజూరు చేయాల్సిందిగా సిఐడి వివరించింది.